kalyan ram: కల్యాణ్ రామ్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు
- కల్యాణ్ రామ్ నుంచి '118'
- త్వరలోనే ఆడియో రిలీజ్
- మార్చి 1వ తేదీన విడుదల
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో '118' సినిమా నిర్మితమైంది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. మార్చి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత మహేశ్ కోనేరు ట్వీట్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు. ఆడియో వేడుకకి సంబంధించిన విషయాలను .. ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపించనున్నాడు. కొంతకాలంగా సక్సెస్ చూడని కల్యాణ్ రామ్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాడనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.