mamata bajerjee: కోల్ కతాలో జరుగుతున్న పరిణామాలను పార్లమెంటులో లేవనెత్తండి: ఎంపీలకు బాబు ఆదేశం

  • బీజేపీని ఎదిరిస్తున్న నేతలపై కేసులు పెడుతున్నారు
  • ఇప్పుడు మమతా బెనర్జీపై కక్ష సాధింపులకు దిగుతున్నారు
  • జరుగుతున్న పరిణామాలపై పార్లమెంటులో నిలదీయండి

బీజేపీకి లొంగిపోయిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నారని... ఆ పార్టీని ఎదిరించిన వారిపై కేసులు పెట్టడం లేదా, పాత కేసులను తిరగదోడటం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు ప్రధాని మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడం కూడా బీజేపీ కుట్రలో భాగమేనని చెప్పారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కక్ష సాధింపులకు దిగుతున్నారని తెలిపారు.

కోల్ కతాలో జరుగుతున్న పరిణామాలపై పార్లమెంటులో లేవనెత్తాలని టీడీపీ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోకుండా... నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారులు చేస్తున్న నిర్వాకంపై పార్లమెంటులో నిలదీయాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు పెట్టి బీజేపీ నేతలు ఆనందిస్తున్నారని మండిపడ్డారు.

mamata bajerjee
tmc
Chandrababu
Telugudesam
modi
bjp
cbi
  • Loading...

More Telugu News