Sunny Leone: విశాల్ తో చిందేయనున్న సన్నీ లియోన్

  • విశాల్ 'అయోగ్య' చిత్రంలో సన్నీ లియోన్
  • తారక్ నటించిన 'టెంపర్' చిత్రానికి ఇది రీమేక్
  • ఐటెం సాంగ్ లో మెరవనున్న సన్నీ

తమిళ నటుడు విశాల్ తో బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ చిందేయనుంది. ప్రస్తుతం విశాల్ 'అయోగ్య' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో విశాల్ తో కలసి ఓ ఐటెం సాంగ్ లో సన్నీ నటించనుంది. ఇప్పటికే సన్నీ తెలుగు, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో కనిపించింది.

మరోవైపు, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చారిత్రక కథా చిత్రం 'వీరమహాదేవి'లో సన్నీ నటిస్తోంది. అయితే, వీరమహాదేవి పాత్రను శృంగార తార సన్నీ పోషిస్తుండటాన్ని కన్నడ, తమిళ ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో విశాల్ చిత్రంలో సన్నీ కనపించనుండటం గమనార్హం.

Sunny Leone
vishal
kollywood
ayogya
  • Loading...

More Telugu News