Narendra Modi: రాజకీయాల నుంచి మోదీ తప్పుకున్న మరుక్షణం నేను కూడా తప్పుకుంటా: స్మృతి ఇరానీ

  • వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం
  • సుష్మాస్వరాజ్, సుమిత్రా మహాజన్‌‌లే నాకు స్ఫూర్తి
  • ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్ఠానం నిర్ణయిస్తుంది

ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న మరుక్షణం తాను కూడా తప్పుకుంటానని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించినందుకు సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రధాని కావాలన్న కోరికైతే తనకు లేదని తేల్చి చెప్పారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రధానిగా మోదీ మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని స్మృతి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. గత ఎన్నికల్లో అమేథీ ప్రజలు తనను గుర్తించలేకపోయారని, కానీ ఇప్పుడు తనను గుర్తుపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, స్పీకర్ సుమిత్రా మహాజన్‌లే తనకు రాజకీయాల్లో స్ఫూర్తి అని స్మృతి వివరించారు.

Narendra Modi
Smriti Irani
BJP
atal bihari vajpayee
  • Loading...

More Telugu News