డాక్యుమెంట్ల కోసం యువతిని ఎరవేశా.. వాటికోసం జయరాం ఇంటికెళ్లా: శిఖా చౌదరి
- నా పేరున పదెకరాల భూమి కొన్నాడు
- డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు
- జయరాం చనిపోయినప్పుడు శ్రీకాంత్‌తో లాంగ్ డ్రైవ్‌లో ఉన్నా
మామయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడని తన తల్లి చెబితేనే ఆ విషయం తనకు తెలిసిందని పేర్కొంది. తన పేరున పది ఎకరాల భూమిని కొన్న జయరాం వాటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని తెలిపింది. జయరాంను తాను చంపలేదని, కాకపోతే అమ్మాయిని ఎరగా వేయడం మాత్రం నిజమేనని అంగీకరించింది. తన పేరున కొన్న భూమి డాక్యుమెంట్ల కోసమే వారి ఇంటికి వెళ్లానని పేర్కొంది.