Jayaram: జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు

  • శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి కాల్ డేటా పరిశీలన
  • వ్యాపార లావాదేవీలు, విభేదాలపై ఆరా
  • తనకూ, పిల్లలకు రక్షణ కోరిన పద్మశ్రీ

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. తాజాగా జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. జయరామ్ వ్యాపార లావాదేవీలు, విభేదాలపై ఆరా తీయగా.. అలాంటివేమీ లేవని పద్మశ్రీ తెలిపినట్టు సమాచారం. తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని పద్మశ్రీ పోలీసులను కోరారు.

ఇదిలా ఉంచితే, శిఖా చౌదరితో తనకు ఐదేళ్లుగా పరిచయముందని, కానీ రాకేష్ రెడ్డి ఎవరో తెలియదని.. శ్రీకాంత్ మాత్రం తనకూ, శిఖా చౌదరికి తెలుసని ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి తెలిపారు. శిఖా చౌదరికి  జయరామ్‌తో చాలా అనుబంధముందని ఆయన వెల్లడించారు.

Jayaram
Padmasri
Sikha chowdary
Rakesh reddy
KP Chowdary
Srikanth
  • Loading...

More Telugu News