Raghu kunche: పల్లె కోయిలమ్మ బేబి పాట.. మిలియన్‌ను దాటేసింది!

  • ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న బేబి పాట
  • ‘పలాస 1978’లో అవకాశం కల్పించిన రఘు కుంచె
  • 80 వేల లైక్స్‌ సొంతం చేసుకున్న పాట

రఘు కుంచె సంగీత సారథ్యంలో పల్లె కోయిలమ్మ పసల బేబి పాడిన పాట మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మట్టి మనిషినండి నేను.. మాణిక్యమన్నారు నన్ను’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. కనీస సంగీత పరిజ్ఞానం కానీ.. అక్షర జ్ఞానం కానీ లేని బేబి అద్భుతంగా పాడటం విన్న సంగీత దర్శకుడు రఘు కుంచె పరవశించిపోయారు. వెంటనే ఆమెకు ‘పలాస 1978’ అనే చిత్రంలో పాడే అవకాశం కల్పించారు.

అలాగే బేబితో ‘మట్టి మనిషినండి నేను..’ అనే పాటను పాడించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు ఈ పాట 10లక్షల 15 వేల వ్యూస్‌ను.. దాదాపు 80 వేల లైక్స్‌ను సొంతం చేసుకుని ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించిన రఘు.. ‘మూడు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్.. నిండు మనసుతో, ప్రేమగా ఈ పాటని ఇష్టపడిన మీ అందరికీ కృతజ్ఞతలు’ అని పోస్ట్ పెట్టారు.

Raghu kunche
Pasala Baby
Million views
Palasa 1978
Youtube
  • Loading...

More Telugu News