Kishor chandra Dev: విజయనగరం జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ.. పార్టీకి కిశోర్ చంద్రదేవ్ గుడ్‌బై!

  • సీనియర్లకు గౌరవం దక్కట్లేదు
  • ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు
  • ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తా

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్‌ను వీడనున్నట్టు ప్రకటించారు. విజయనగరం జిల్లా కురుపాంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కట్లేదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

పార్టీ వీడాలనే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని.. ఎన్నో రోజులుగా ఆలోచించి పార్టీని వీడానని అన్నారు. దేశ రాజకీయాలు.. ప్రస్తుత పరిస్థితిని చూసి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే చెబుతానన్నారు.

Kishor chandra Dev
Andhra Pradesh
Vijayanagaram
Congress
  • Loading...

More Telugu News