YSRCP: వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసు.. నిందితుడు చంచల్ గూడ జైలుకు తరలింపు

  • నిందితుడు వెంకటేశ్వరరావు నిన్న అరెస్టు
  • గుంటూరు నుంచి హైదరాబాద్ కు తరలింపు
  • చంచల్ గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు

వైెఎస్ షర్మిలపై సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావుని ఈ రోజు చంచల్ గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని జైలుకు తరలించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. కాగా, నిందితుడు వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన వ్యక్తి. గుంటూరులోని ఆర్వీఆర్ కళాశాలలో ఎంసీఏ చదువుతున్నాడు. నిన్న గుంటూరులో అతనిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. 

YSRCP
sharmila
venkateswarlu
chanchala guda jail
prakasam
vemula
guntur
RVR
  • Loading...

More Telugu News