coastal bank: మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచోడు కాదు!: విచారణలో శిఖా చౌదరి

  • మామయ్యకు, నాకు శారీరక సంబంధం ఉంది
  • మా చెల్లెలిని వేధించేవాడు
  • వేధింపులు తట్టుకోలేకనే ఆమె దూరంగా ఉంటోంది

మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచోడు కాదని, తనను, తన చెల్లిని లైంగికంగా వేధించాడని మేనకోడలు శిఖా చౌదరి ఆరోపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరి, పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించింది. మేనకోడలిని అయిన తనతోనూ శారీరక సుఖం కోరుకునేవాడని, తన మామయ్యకు, తనకు శారీరక సంబంధం ఉందని, అది తమ వ్యక్తిగత విషయమని, అందులో తప్పేముందని శిఖా చౌదరి పోలీసులతో అన్నట్టు సమాచారం.

తన చెల్లెలికి జయరామే మెడికల్ సీటు ఇప్పించాడని, అయితే, ఆయన వేధింపులు తట్టుకోలేకనే దూరంగా ఉంటోందని చెప్పినట్టు తెలిసింది. మామయ్యను రాకేశ్ చంపుతాడని అనుకోలేదని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు శిఖా చౌదరి చెప్పిందట. కాగా, జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డిని ఎస్పీ త్రిపాఠి విచారిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఓ మహిళ సహా మరో ఇద్దరిని వత్సవాయి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

coastal bank
jayaram
sikha chowdary
  • Loading...

More Telugu News