Manipal: 148 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

  • ఇంత పెద్ద ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి
  • ఎన్జీవోల సాయంతో ఇలాంటి ఆపరేషన్లు చేస్తుంటాం
  • మరోసారి పునరావృతం కాకుండా చూస్తాం

మణిపూర్‌లో 148 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తుండగా.. ప్రత్యేక రైడ్ ద్వారా పోలీసులు బాలికలను కాపాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టెంనౌపాల్ ప్రాంతం నుంచి బాలికలను అక్రమ రవాణా చేస్తుండగా గుర్తించి కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇలాంటి ఆపరేషన్లు కొన్ని ఎన్జీవోల సాయంతో చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Manipal
Gilrs
Temnoupal
NGO
Police
  • Loading...

More Telugu News