coastal bank: జయరాం హత్యకు, నాకు ఎలాంటి సంబంధం లేదు: పోలీస్ విచారణలో శిఖా చౌదరి

  • హత్య జరిగిన రోజున వికారాబాద్ కు లాంగ్ డ్రైవ్ కి వెళ్లా
  • మామయ్య చనిపోయినట్టు అమ్మ ఫోన్ చేస్తే తెలిసింది
  • శ్రీకాంత్, నేను కలిసి జయరాం ఇంటికెళ్లాం

ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరి, పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించింది. మామయ్య జయరాం హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య జరిగిన రోజున శ్రీకాంత్ తో కలిసి తాను వికారాబాద్ కు లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్టు పోలీసులకు చెప్పింది.

జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని తన తల్లి ఆ రోజు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి తనకు చెప్పిందని, దీంతో, శ్రీకాంత్, తాను కలిసి జయరాం ఇంటికెళ్లామని, జగ్గయ్యపేటలో తనకు రాసిచ్చిన పది ఎకరాల భూమి పత్రాల కోసం వెతికామని, ఆ తర్వాత జయరాంను చూసేందుకు విజయవాడ వెళ్లానని, అప్పుడే, బెజవాడ పోలీసులు తనను రమ్మనమని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లానని ఈ విచారణలో శిఖా చౌదరి చెప్పినట్టు తెలుస్తోంది. 

coastal bank
jayaram
sikha chowdary
vikarabad
  • Loading...

More Telugu News