coastal bank: జయరాం హత్య కేసు విచారణ.. ఆసక్తికర విషయాలు చెప్పిన శిఖా చౌదరి!

  • నాకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి
  • ఆ ఇద్దరితో విడాకులు తీసుకున్నా
  • రాకేశ్ రెడ్డితో డేటింగ్ చేశా

ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరి, పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ఆ ఇద్దరితో విడాకులు తీసుకున్నానని చెప్పింది. తన రెండో భర్తను వదిలేయడానికి రాకేశ్ రెడ్డే కారణమని, అతనితో డేటింగ్ చేశానని, రెండో భర్తతో విడాకులు వచ్చాక  అతన్ని పెళ్లి చేసుకుందామనుకున్నట్టు చెప్పింది. తన మామయ్య జయరాంకి రాకేశ్ రెడ్డిని పరిచయం చేసింది తానేనని చెప్పిన శిఖా చౌదరి, ఆయన వల్లే తాను రాకేశ్ కి దూరం కావాల్సి వచ్చిందని ఈ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. రాకేశ్ కి సొంత వ్యాపారాలంటూ ఏవీ లేవని ఆమె చెప్పినట్లు సమాచారం. 

coastal bank
jayaram
express tv
sikha chowdary
  • Loading...

More Telugu News