Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ టికెట్ల అమ్మకాల్లో అవినీతి!

  • ఒకే టికెట్ నెంబర్ తో అనేక దర్శన టికెట్ల విక్రయం
  • ఆలయంలో అధిక రద్దీ రోజుల్లోనూ తక్కువ ఆదాయం
  • ఈవోకు అనుమానం రావడంతో బయటపడ్డ వ్యవహారం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం టికెట్ల విక్రయాల్లో అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఒకే టికెట్ నెంబర్ తో అనేక దర్శన టికెట్లు విక్రయిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొట్టారు. ఆలయంలో అధిక రద్దీ రోజుల్లోనూ తక్కువ ఆదాయం రావడంతో ఈవోకు అనుమానం వచ్చింది. దీంతో,  టికెట్ల విక్రయాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఈ అవినీతి బాగోతం బయటపడింది. ఎప్పటి నుంచి ఈ అవినీతి తతంగం జరుగుతోందనే విషయమై సంబంధిత అధికారులు దృష్టి పెట్టారు. లక్షలాది రూపాయల ఆలయ ఆదాయానికి గండి పడి ఉంటుందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు.

Vijayawada
kanaka durga
temple
indrakeeladri
  • Loading...

More Telugu News