Andhra Pradesh: ఏపీకి ఏ మొహం పెట్టుకుని అమిత్ షా వస్తున్నారు?: మంత్రి కళా వెంకట్రావు

  • ఏపీకి అన్యాయం చేశారు
  • అందులో మోదీ, అమిత్ షాలు ప్రథములు
  • ఏపీకి బీజేపీ నేతల రాకను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు

ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని బీజేపీపై మంత్రి కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం చేసిన వారిలో మోదీ, అమిత్ షాలు ప్రథములని ఆరోపించారు. ఏపీ పర్యటనకు అమిత్ షా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి బీజేపీ నేతల రాకను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పైన, సాక్షి పేపర్ పైన, ఛానెల్ పైన ఆయన ఆరోపణలు చేశారు. అవినీతి సొమ్ముతో వీటిని స్థాపించారని ఇందులో వచ్చే కథనాలను ప్రజలు నమ్మొద్దని కోరారు.

Andhra Pradesh
bjp
amith shah
minister
kala venkat rao
modi
Prime Minister
  • Loading...

More Telugu News