jayaram murder: శిఖాచౌదరి ప్రియుడే జయరాం హంతకుడు: నిర్థారించిన పోలీసులు

  • కిరాయి హంతకులతో రాకేష్‌రెడ్డి పాల్పడినట్లు నిర్థారణ
  • విషం ఇంజక్షన్‌ ఇచ్చి, ఆపై బీరు బాటిల్‌తో తలపై బాది హత్య
  • ఆర్థిక లావాదేవీలే అసలు కారణం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జయరాం మేనకోడలు శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌ రెడ్డి, మరికొందరు కిరాయి హంతకులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. రాకేష్‌రెడ్డికి చెల్లించాల్సిన నాలుగున్నర కోట్ల రూపాయల విషయమై తలెత్తిన విభేదాలే హత్యకు కారణంగా నిర్థారించారు.

డబ్బు విషయంలో జయరాంతో విభేదాలు తలెత్తడంతో ప్రియురాలు శిఖాచౌదరితో కలిసి రాకేష్‌ అతన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. పథకం ప్రకారం కారులో జయరాంకు విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి, అనంతరం బీర్‌ బాటిల్‌తో తలపైకొట్టి హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

jayaram murder
prime culprit recognised
5 arrest
  • Loading...

More Telugu News