india: చెలరేగిన పాండ్యా.. గౌరవప్రదమైన స్కోరును సాధించిన టీమిండియా

  • 252 పరుగులకు ఆలౌటైన భారత్
  • 22 బంతుల్లో 45 పరుగులు చేసిన పాండ్యా
  • 90 పరుగులు చేసిన భారత్ ను ఆదుకున్న రాయుడు

వెల్లింగ్లన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్టేలో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. 49.5 ఓవర్లలో 252 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు. మరో భారీ షాట్ కు యత్నించి నీషమ్ బౌలింగ్ లో బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరోవైపు అంబటి రాయడు 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో మన్రోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాదవ్ 34, విజయ్ శంకర్ 45 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. చాహల్ (0) నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ 4, బౌల్ట్ 3, నీషమ్ ఒక వికెట్ పడగొట్టారు.

india
new zealand
odi
wellington
score
pandya
  • Loading...

More Telugu News