Chandrababu: వైసీపీకి డ్వాక్రా మహిళలే బుద్ధి చెబుతారు: చంద్రబాబు
- పసుపు-కుంకుమ పథకాన్ని భగ్నం చేసేందుకు వైసీపీ యత్నిస్తోంది
- చెక్కులు చెల్లవనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు
- రేపటి నుంచి డబ్బులు తీసుకోవచ్చు
డ్వాక్రా, ఇతర సంఘాలను 25 ఏళ్ల క్రితమే తాను నెలకొల్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహిళలు, వృద్ధుల బాధలు చూసి రూ. వెయ్యి పెన్షన్ ను ప్రకటించానని... ఇప్పుడు దాన్ని రూ. 2వేలు చేశానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పసుపు-కుంకుమ పథకాలను కొనసాగిస్తున్నామని... ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీకి డ్వాక్రా మహిళలే బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.
పసుపు-కుంకుమ డబ్బును మహిళలు దుర్వినియోగం చేయరని చంద్రబాబు అన్నారు. రూ. 20 వేల చొప్పున ఒక్కో మహిళకు అందస్తున్నామని తెలిపారు. చెక్కులు చెల్లవనే తప్పుడు ప్రచారాన్ని మహిళలు నమ్మవద్దని చెప్పారు. బ్యాంకుల్లో రూ. 2400 కోట్లు డిపాజిట్ చేశామని... రేపటి నుంచి డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు.