Tollywood: అలాంటి దుస్తులు ఎందుకు వేసుకోవాలి? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనపై ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఫైర్

  • ఎటువంటి దుస్తులు ధరించాలనేది వారికి తెలియడం లేదు
  • సినిమా ఫంక్షన్లకు అలాగేనా వచ్చేది
  • నా వ్యాఖ్యలు వారికి అర్థం కావనుకుంటున్నా

హీరోయిన్ల వస్త్రధారణపై ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్టి దుస్తులు ధరించి అంగాంగ ప్రదర్శన చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు. అది వారి అమాయకత్వమనుకోవాలా? లేక, అటువంటి దుస్తులు ధరిస్తే తప్ప సినిమాల్లో అవకాశాలు రావని భావిస్తున్నారని అనుకోవాలా? అని వాపోయారు. సినిమా వేడుకలకు ఎటువంటి దుస్తులు ధరించి రావాలన్న విషయం నేటి మహిళా నటులకు తెలియడం లేదన్నారు.  

తన వ్యాఖ్యలపై హీరోయిన్లు మండిపడినా తన అభిప్రాయం మాత్రం ఇదేనని బాలు తేల్చి చెప్పారు. అయినా, చాలామంది హీరోయిన్లకు తెలుగు రాదని, కాబట్టి తానేమన్నాననే విషయం వారికి అర్థం కాకపోవచ్చని అన్నారు. తన వ్యాఖ్యలపై హీరోయిన్లు ఎలా స్పందిస్తారన్న విషయంతో తానేమీ భయపడడం లేదన్నారు.

Tollywood
Playback Singer
Heroines
Dress sence
SP Balasubrahmanyam
controversial remarks
  • Loading...

More Telugu News