Pawan Kalyan: జనసేనలోకి వెళ్లడం లేదు: గంటా శ్రీనివాసరావు

  • నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • టీడీపీని వీడే సమస్యే లేదు
  • పవన్ వల్లే నేను గెలిచాననడం సరి కాదు

తాను టీడీపీని వీడుతున్నానని, జనసేనలోకి వెళ్లబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తాను పార్టీ మారే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తన గెలుపులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాత్ర ఉందని... అయితే, ఆయన వల్లే తాను గెలిచాననడం సరికాదని చెప్పారు. పక్కనున్న వారు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదవడం సరికాదని అన్నారు. రాజకీయాలపై మరింత అవగాహనను పవన్ పెంచుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు. 

Pawan Kalyan
janasena
Ganta Srinivasa Rao
Telugudesam
modi
bjp
  • Loading...

More Telugu News