NTR: నేను నిత్య విద్యార్థిని.. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు

  • భువనేశ్వరిపై నమ్మకం ఉంది
  • రెసిడెన్షియల్ పాఠశాలలు ఎన్టీఆరే నెలకొల్పారు
  • పేద విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం

ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను భవిష్యత్‌లో వర్సిటీ స్థాయికి తన సతీమణి భువనేశ్వరి తీసుకెళుతుందన్న నమ్మకం తనకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తను నిత్య విద్యార్థినని.. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని ఆయన అన్నారు. నేడు ఆయన ఎన్టీఆర్ మోడల్ స్కూల్ విషయమై మాట్లాడుతూ.. పేదలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఎన్టీఆరే నెలకొల్పారని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారి పిల్లల కోసం ఎన్టీఆర్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం పేద విద్యార్థులు కూడా వాటిలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. తెలుగుజాతి భవిష్యత్ కోసమే తాను సైబరాబాద్ నిర్మించానని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.

NTR
Chandrababu
Bhuvaneswari
Residential School
Cyberabad
  • Loading...

More Telugu News