Tollywood: బుర్రిపాలెం వెళ్లి ఆదిశేషగిరిరావును టీడీపీలోకి ఆహ్వానించనున్న నేతలు!

  • రేపు బుర్రిపాలెం వెళ్లనున్న టీడీపీ నేతల బృందం 
  • ఈ బృందంలో బుద్ధా వెంకన్న, రాజా తదితరులు
  • వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు

ప్రముఖ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును టీడీపీలోకి ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంకు టీడీపీ నేతల బృందం వెళ్లనుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆదిశేషగిరిరావును కలవనున్న టీడీపీ బృందంలో బుద్ధా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, జలీల్ ఖాన్ ఉన్నారు. కాగా, గతంలో వైసీపీలో ఉన్న ఆదిశేషగిరిరావు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Tollywood
super star
krishna
adi seshagiri rao
tenali
burripalem
Guntur District
Telugudesam
  • Loading...

More Telugu News