Godavari: గోదావరిలో స్నానానికి దిగి.. ముగ్గురి గల్లంతు

  • జన్మదిన వేడుకల కోసం వెళ్లిన స్నేహితులు
  • ఆరుగురిలో సురక్షితంగా బయటపడిన ముగ్గురు
  • ఐటీసీ కాగితం మిల్లులో పనిచేస్తున్న బాధితులు

గోదావరిలో స్నానానికి దిగిన ఆరుగురిలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపుతోంది. కుక్కునూరు మండలం వేలూరు వద్ద గల గోదావరి నదికి జన్మదిన వేడుకల కోసం ఆరుగురు స్నేహితులు వచ్చారు.

వారంతా స్నానానికని గోదావరిలో దిగగా ముగ్గురు గల్లంతవగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిని శ్రీనివాసరెడ్డి(20), శివారెడ్డి(21), శేషు(21)గా గుర్తించారు. ఈ ముగ్గురూ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిరెడ్డిపాలెం వాసులని.. ఐటీసీ కాగితం మిల్లులో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నారని తెలిసింది.

Godavari
East Godavari
Kukkunur
Srinivasa Reddy
Siva Reddy
Seshu
  • Loading...

More Telugu News