cbi: సీబీఐ నూతన డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లా నియామకం

  • శుక్లాను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ  
  • ఆమోదించిన కేబినెట్ నియామకాల కమిటీ  
  • ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్న శుక్లా

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్ ని ప్రభుత్వం నియమించింది. సీబీఐ నూతన డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లాను నియమించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు శుక్లాను ఎంపిక చేసింది. ఈ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ పదవిలో శుక్లా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా శుక్లా పని చేశారు. 1983 బ్యాచ్ కు చెందిన శుక్లాపై పెద్దగా వివాదాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే సీబీఐ పగ్గాలను ఆయనకు అప్పగించేందుకు సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపినట్టు సమాచారం. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News