YSRCP: దర్యాప్తు జరిగితే అది ‘కోడి కత్తో, నారా కత్తో’ తేలుతుంది: వైసీపీ నేత ఇక్బాల్

  • ఏపీ ప్రభుత్వం నిస్పిగ్గుగా వ్యవహరిస్తోంది
  • ఎన్ఐఏ దర్యాప్తును అడ్డుకోవడం దిగజారుడుతనమే
  • ప్రత్యేక హోదాను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత ఇక్బాల్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని దుమ్మెత్తిపోశారు. టీడీపీ నేతలు ‘కోడికత్తి’ అని ఎగతాళి చేస్తున్నారని, ఈ కేసు దర్యాప్తు జరిగితే అది ‘కోడి కత్తో.. నారా కత్తో’ తేలుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, డీజీపీలు ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ప్రజలకు మొఖం చూపించే అర్హత చంద్రబాబుకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ నిన్న చంద్రబాబు నల్ల చొక్కా ధరించడంపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నల్ల చొక్కా ధరించడం కాదు, తన మొఖానికి నల్లరంగు పూసుకోవాలని, ప్రత్యేక హోదాను నిర్వీర్యం చేసిందే బాబని విమర్శించారు. తమ పార్టీ చేస్తున్న పోరాటం వల్లే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News