Hyderabad: గాంధీభవన్ లో వీహెచ్, శ్రీకాంత్ వర్గీయుల ఘర్షణ.. కుర్చీలు విసురుకున్న వైనం!

  • గాంధీ భవన్ లో మల్లు భట్టివిక్రమార్కకు సన్మానం
  • ఈ కార్యక్రమానికి హాజరైన వీహెచ్, నూతి శ్రీకాంత్
  • శ్రీకాంత్ కు వీహెచ్ టికెట్ రాకుండా చేశారంటూ ఘర్షణ  

హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు (వీహెచ్), నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు.

 మొన్నటి ఎన్నికల్లో శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఘర్షణ తలెత్తింది. బీసీలకు  అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ వీహెచ్ ని శ్రీకాంత్ వర్గీయులు అడ్డుకున్నారు. భట్టి విక్రమార్క చూస్తుండగానే వీహెచ్, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటం గమనార్హం.  

Hyderabad
gandhi bhavan
vh
nuthi
srikanth
Mallu Bhatti Vikramarka
clp leader
Telangana
  • Loading...

More Telugu News