modi: ఈ నెలలో ఏపీలో మోదీ, అమిత్ షాలు పర్యటిస్తారు: కన్నా లక్ష్మీనారాయణ

  • 10న గుంటూరులో, 16న విశాఖలో మోదీ పర్యటన
  • ఈ నెల 4న విజయనగరంలో అమిత్ షా పర్యటిస్తారు
  • పలాస నుంచి ‘సత్యమేవ జయతే’ బస్సు యాత్ర ప్రారంభిస్తారు

ఈ నెల 10న గుంటూరులో, 16న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జరుగుతున్న అవినీతిపై మోదీ గళం విప్పుతారని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఏపీకి ఇచ్చిన నిధులను ఆయన వివరించనున్నట్లు చెప్పారు.

అదే విధంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఏపీలో  పర్యటిస్తారని అన్నారు. ఈ నెల 4న విజయనగరంలో నిర్వహించే పార్లమెంట్ స్థాయి శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశమవుతారని, అనంతరం, పలాస నుంచి ‘సత్యమేవ జయతే’ బస్సు యాత్రను ఆయన ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 19న ఒంగోలులో, 21న రాజమహేంద్రవరంలో శక్తి కేంద్రాల సభ్యులతో అమిత్ షా సమావేశం కానున్నట్టు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

modi
amith shah
kanna
bjp
Andhra Pradesh
  • Loading...

More Telugu News