Andhra Pradesh: ఎమ్మెల్సీ సీటు విషయమై చంద్రబాబును కలిసిన రాయపాటి సోదరులు!

  • కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం వినతి  
  • ఈ అంశంపై పరిశీలిస్తానన్న చంద్రబాబు
  • రెండ్రోరోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు 

సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన సోదరుడు  శ్రీనివాస్ లు ఈరోజు కలిశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు తనకు కేటాయించాలని రాయపాటి శ్రీనివాస్ కోరినట్టు సమాచారం. ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అంశం పరిశీలిస్తానని రాయపాటి సోదరులకు సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, రెండ్రోరోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేయనున్నారు. రాయపాటి శ్రీనివాస్ వైపే టీడీపీ మొగ్గుచూపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

Andhra Pradesh
Chandrababu
rayapathi sambasiva rao
rayapathi srinivas
krishna
Guntur
  • Loading...

More Telugu News