navyandhra: విభజన అన్యాయంపై చర్చించేందుకే సమావేశం: ఉండవల్లి అరుణ్ కుమార్

  • మన ఆవేదన దేశానికి తెలియాలి
  • బిల్లును శాసన సభ తిరస్కరించిందని చెప్పగలగాలి
  • విజయవాడ సమావేశం ఉద్దేశం అదే

రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా తెలిసి, చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే అన్నివర్గాలతో తాను విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో నేను పెట్టిన సమావేశంపై కొందరికి అనుమానాలు ఉన్నాయని, అవేవీ నిజం కాదన్నారు. విభజిస్తే ఏం జరుగుతుందో తెలియకుండానే విభజించారని, బిల్లును శాసన సభ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా జరిగిన తప్పును అంతా ముక్తకంఠంతో ఖండించాలని, మన గొంతు దేశవ్యాప్తంగా వినిపించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

navyandhra
Undavalli
  • Loading...

More Telugu News