Kangana Ranaut: క్రిష్, సోనూసూద్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన కంగనా రనౌత్!

  • 'మణికర్ణిక'కు దర్శకత్వం వహించింది నేనే
  • క్రిష్ ఆరోపణలు నిజమైతే నిరూపించుకోవాలి
  • నన్ను టార్గెట్ చేయడం సరికాదు
  • స్విస్ నుంచి వచ్చిన తరువాత కంగనా రనౌత్

రెండు వారాల క్రితం వెండితెరను పలకరించి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న 'మణికర్ణిక' తన చిత్రమేనని, నటి కంగన తనకు తీవ్ర అన్యాయం చేసిందని, తాను బంగారాన్ని ఇస్తే, దాన్ని వెండిగా మార్చేసిందని ప్రముఖ దర్శకుడు క్రిష్ చేసిన విమర్శలపై కంగనా రనౌత్ తొలిసారిగా స్పందించింది.

 స్విట్జర్లాండ్ ట్రిప్ ముగించుకుని ఇండియాకు చేరుకున్న ఆమె, వివాదాన్ని ప్రస్తావిస్తూ, 'మణికర్ణిక'కు దర్శకత్వం వహించింది తానేనని స్పష్టం చేశారు. ఈ మాట నిజమని, క్రిష్ తనను టార్గెట్ చేయడం సరికాదని చెప్పింది. ఆయన మాటలు నిజమైతే నిరూపించుకోవాలని సవాల్ విసిరింది. మీడియా ముందు మాట్లాడి లాభం లేదని సలహా ఇచ్చింది.

 ఇక తన పాత్రను తొలగించడంపై సోనూ సూద్ చేసిన ఆరోపణలపైనా కంగన స్పందిస్తూ, తన పాత్రను తీసేశారని ఆరోపించే వారికి తన సమాధానం ఒక్కటేనని, నటిగా, ఫిల్మ్ మేకర్ గా మూడు అవార్డులు గెలుచుకున్న తాను అన్నింటినీ స్వయంకృషితో సాధించానని చెప్పింది. ఆరోపణలు చేసేవారు తన స్థాయిని అందుకునేందుకు కృషి చేయాలని, ఇంకొకరిని చూసి ఏడుస్తుంటే లాభం ఉండదని అంది.

Kangana Ranaut
Manikarnika
Krish
Sonusood
  • Loading...

More Telugu News