K Kavitha: వివిధ పదవులకు కవిత రాజీనామా!

  • సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కవిత
  • దానితో పాటు పలు సంఘాల పదవులకూ రిజైన్
  • పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున నిర్ణయం

సింగరేణి బొగ్గు కార్మిక సంఘంతో పాటు పలు సంఘాల పదవులకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఆమె ఎంపీగా ఎన్నిక కాకముందు నుంచి ఉన్న పదవులను, ఎంపీగా గెలిచిన తరువాత చేపట్టిన గౌరవాధ్యక్ష పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ఈ ఉదయం ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటం, తిరిగి నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయనున్న నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె పలు సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘాల కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ప్రజా సంక్షేమం, సొంత నియోజకవర్గానికి అధిక సమయం కేటాయించలేకపోతున్నానన్న ఉద్దేశంతో కవిత పదవులకు రాజీనామా చేశారు. కాగా, హరీశ్ రావు సైతం ఇటీవల టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

K Kavitha
Singareni
Honorary President
Resign
  • Loading...

More Telugu News