Maharashtra: మహారాష్ట్రలో మూడుసార్లు భూకంపం.. ఇల్లు కూలి రెండేళ్ల చిన్నారి మృతి

  • స్వల్ప వ్యవధిలో మూడుసార్లు భూకంపం
  • ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు
  • అత్యధికంగా 4.1 తీవ్రత నమోదు

మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలో శుక్రవారం భూమి మూడుసార్లు కంపించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం 2.06 గంటలకు మొదటిసారి, 3.53 గంటలకు రెండోసారి కంపించిన భూమి 4.57 గంటలకు మరోసారి కంపించింది. భూకంపం తీవ్రత అత్యధికంగా 4.1గా నమోదైంది. స్వల్ప వ్యవధిలో ఇలా మూడుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

Maharashtra
earthquake
palghar
Two year baby
Died
  • Loading...

More Telugu News