sakshi chaudhary: ఇంత దారుణమా? ఒక్క రాత్రికి కోటి ఇస్తానంటూ వేధిస్తున్నారు: సినీ నటి సాక్షి చౌదరి

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే సాక్షి చౌదరి
  • తన హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తున్న ముద్దుగుమ్మ 
  • వారి బండారం బయటపెడతానని వార్నింగ్

ఒక రాత్రికి వస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తామంటూ కొందరు తనకు ఆఫర్ చేస్తున్నారంటూ టాలీవుడ్ నటి సాక్షి చౌదరి ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రికి వస్తావా? రేటు ఎంత? అంటూ తనను వేధిస్తున్నారని పేర్కొంది. పోటుగాడు, జేమ్స్‌బాండ్, సెల్ఫీరాజా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాక్షి సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారును వేడెక్కిస్తోంది. ప్రేక్షకుల్ని ఉత్సాహపరచడమే తన పని అని పేర్కొన్న సాక్షి హాట్ అందాలతో సెగలు రేపుతోంది. తన హాట్ ఫొటోలను చూసి జనాలు పిచ్చెత్తిపోతున్నారని, అక్కడి వరకు బాగానే ఉంది కానీ తనకు రేటు కట్టడమే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నటి అయినంత మాత్రాన చులకనగా చూడాల్సిన పనిలేదని, తనకు ఆఫర్ చేసేవారు పెద్ద మూర్ఖులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి ఆఫర్లతో ముందుకొస్తే వారి బండారాన్ని బయటపెడతానని సాక్షి చౌదరి వార్నింగ్ ఇచ్చింది.  

sakshi chaudhary
Tollywood
Social Media
Potugadu
Jamesbond
selfie Raja
  • Error fetching data: Network response was not ok

More Telugu News