Karnataka: బడ్జెట్‌ను ఆర్థిక శాఖ తయారు చేసిందా? ఆర్ఎస్ఎస్ తయారు చేసిందా?: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • నేను ప్రకటిస్తే లాలీపాప్ అని పరిహసిందారు
  • రైతులకు మోదీ కాటన్ క్యాండీ ఇచ్చారు
  • బీజేపీ అలాంటి బడ్జెట్‌నే తయారు చేసింది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. తాను రైతు రుణమాఫీని ప్రకటించినప్పుడు అదో లాలీపాప్ అని పరిహసించారని.. కానీ ఇప్పుడు బీజేపీ మిత్రులే అలాంటి బడ్జెట్‌ను తయారు చేశారని చురక అంటించారు. నేడు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక శాఖ అధికారులు తయారు చేశారా? లేదంటే ఆర్ఎస్ఎస్ తయారు చేసిందా? అని నిలదీశారు. రైతులకు నరేంద్ర మోదీ కాటన్ క్యాండీ ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Karnataka
Kumara Swamy
BJP
Central Government
Narendra Modi
  • Loading...

More Telugu News