Hyderabad: శంషాబాద్‌లో రెండస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం

  • కూలర్లు తయారు చేసే పరిశ్రమలో విద్యుదాఘాతం
  • మంటలను అదుపు చేస్తున్న నాలుగు ఫైరింజన్లు
  • కార్మికులు బయటకు పరిగెత్తడంతో తప్పిన ప్రాణనష్టం

విద్యుదాఘాతం కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరగడంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో కలకలం రేగింది. శంషాబాద్ మండలం శాతంరాయిలోని రెండస్తుల భవనంలో విడిభాగాలతో కూలర్లు తయారు చేసే పరిశ్రమను నిర్వహిస్తున్నారు.

అయితే నేటి సాయంత్రం ఈ భవనంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.

Hyderabad
Shamshabad
Coolers
Fire Accident
  • Loading...

More Telugu News