Chandrababu: పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబే సొంతంగా చూస్తున్నారు: విష్ణుకుమార్ రాజు

  • నోట్ల రద్దుతో పారదర్శకత పెరిగింది
  • పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది
  • కేంద్రం చొరవతోనే ప్రాజెక్టుల నిర్మాణం

సీఎం చంద్రబాబుకు ఎంత సహకరిస్తున్నా.. నిత్యం విమర్శిస్తున్నారని.. పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు తన సొంతంగా చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మండిపడ్డారు. నేడు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం ప్రతులను మీడియా సమావేశంలో చింపేశారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ, నోట్ల రద్దుతో పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య సైతం పెరిగిందన్నారు. రైతు బంధు పథకానికి, కేంద్ర పథకానికి తేడా ఉందని.. రూ.6 వేలు పెట్టుబడి సాయం అనేది సాహసోపేత నిర్ణయమని కేంద్రాన్ని కొనియాడారు. రైల్వే జోన్, స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని.. కేంద్రం చొరవతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.

Chandrababu
Vishnukumar Raju
Somu Verraju
Kanna Lakshminarayana
Assembly
Madhav
  • Loading...

More Telugu News