Jayaram: హైదరాబాద్ కేంద్రంగానే జయరాం హత్య?.. జయరాం మేనకోడల్ని నందిగామకు తరలిస్తున్న పోలీసులు!

  • దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు
  • జయరాం కుటుంబ సభ్యుల విచారణ పూర్తి
  • కోస్టల్ బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

కోస్టల్ బ్యాంకు ఎండీ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును నందిగామ పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జయరాం కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్ బ్యాంకు సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.

దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న జయరాం మేనకోడలు మాధురి అలియాస్ శిఖా చౌదరిని పోలీసులు నందిగామకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ తేలిన విషయాలను బట్టి హైదరాబాద్ కేంద్రంగానే జయరాం హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Jayaram
Murder
Hyderabad
Nandigama
Sikha Chowdary
Coastal bank
  • Loading...

More Telugu News