Rahul Gandhi: ‘సేవ్ ది నేషన్- సేవ్ డెమోక్రసీ’.. ఎన్టీయేతర పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

  • ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • 25 పార్టీలకు చెందిన నేతలు హాజరు

ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన ఎన్డీయేతర పక్షాల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ‘సేవ్ ది నేషన్- సేవ్ డెమోక్రసీ’ పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్,అహ్మద్ పటేల్, డీఎంకే నేత కనిమొళి, లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ సహా 25 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈవీఎంల పనితీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలపై, బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన ర్యాలీలపై చర్చిస్తారని సమాచారం.  

Rahul Gandhi
Chandrababu
Telugudesam
Congress
delhi
upa
gulam nabi azad
ahammad patel
kanimoli
  • Loading...

More Telugu News