budget: ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుక్కునేలా ఉన్న బడ్జెట్ ఇది!: సుజనా చౌదరి

  • ఇది దేశానికి ఉపయోగపడే బడ్జెట్ లా లేదు
  • బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలా ఉంది
  • ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది

ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుక్కునేలా కేంద్రం ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్ లా ఇది ఉందని టీడీపీ నేత సుజనా చౌదరి విమర్శించారు. ఇది దేశానికి ఉపయోగపడే బడ్జెట్ లా లేదని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ లా లేదని, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలా ఉందని, ఐదేళ్లుగా పట్టించుకోకుండా, ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదని, దీనిపై కోర్టుకు వెళ్లి అనేక అంశాలను సవాల్ చేయొచ్చని వ్యాఖ్యానించారు.

 ఈ బడ్జెట్ లో ఏపీ అంశాలేవీ ప్రస్తావించలేదని, అలాగే, నిరుద్యోగం గురించిన ప్రస్తావన లేదని విమర్శించారు.  కాగా, మరో టీడీపీ నేత తోట నరసింహం మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో న్యాయం చేయరని తమకు తెలుసని వ్యాఖ్యానించారు.  

budget
Telugudesam
Sujana Chowdary
Andhra Pradesh
  • Loading...

More Telugu News