Andhra Pradesh: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్

  • బీజేపీపై బాబు చేసిన వ్యాఖ్యలపై కన్నా మండిపాటు
  • బాబు తన భాషను సరిచేసుకోవాలి
  • బాబు అవినీతి చూస్తుంటే ప్రజలకు రక్తం ఉడికిపోతోంది

బీజేపీపైన, ఆ పార్టీ నేతలపైన సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, తన భాషను సరిచేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు అవినీతి చూస్తుంటే ప్రజలకు రక్తం ఉడికిపోతోందని, రాష్ట్రం కోసం హెరిటేజ్ డబ్బులు పెడుతున్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చంద్రబాబు తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం తగదన్న కన్నా, మనిషిగా ఉండే అర్హత చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Andhra Pradesh
Chandrababu
Telugudesam
bjp
kanna
  • Loading...

More Telugu News