hand cuff challenge: ‘హ్యాండ్ కఫ్ ఛాలెంజ్’ను స్వీకరించిన సన్నీలియోన్.. వీడియో విడుదల.. సోషల్ మీడియాలో వైరల్!

  • భర్త డానియేల్ తో కలిసి వీడియో రిలీజ్
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి
  • భర్తతో కలిసి జిమ్ లో వర్కవుట్లు

ఇటీవల ఐస్ బకెట్ ఛాలెంజ్, 10 years challengeలు బాగా వైరల్ గా మారాయి. ఈ 10 years challengeలో భాగంగా పదేళ్ల క్రితం, ఇప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ చేశారు. తాజాగా మరో ఛాలెంజ్ తెరపైకి వచ్చింది. అదే ‘హ్యాండ్ కఫ్ ఛాలెంజ్’. ఇందులో భాగంగా భార్యాభర్తలు లేదా ప్రేమికులు తమ చేతికి బేడీలు వేసుకోవాలి. అనంతరం రోజువారీ పనులు చేసుకుంటూ షూట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి, శృంగార తార సన్నిలియోన్ తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి హ్యాండ్ కఫ్ ఛాలెంజ్ ను స్వీకరించింది. డేనియల్ తో కలిసి జాగింగ్, ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.

hand cuff challenge
Sunny Leone
Social Media
Viral Videos
posted
  • Error fetching data: Network response was not ok

More Telugu News