chalasani srinivas: బంద్ లో సినీ పరిశ్రమ కూడా పాల్గొనాలి: చలసాని శ్రీనివాస్

  • బంద్ కు అన్ని పార్టీలు కలసి రావడం సంతోషకరం
  • ఉద్యోగులు కూడా సంఘీభావం ప్రకటించారు
  • ఏపీకి హోదా ఇవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన లక్ష్యంగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్ ఎదుట సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని పార్టీలు కలసి రావడం సంతోషకరమని చెప్పారు. సినీ పరిశ్రమ కూడా ఈ బంద్ లో పాల్గొనాలని కోరారు. ఉద్యోగులు కూడా బంద్ కు సంఘీభావం ప్రకటించారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడంతో పాటు, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

chalasani srinivas
ap
special status
vijayawada
film industry
  • Loading...

More Telugu News