Visakhapatnam District: అరకు ఎమ్మెల్యే కిడారి హత్యోదంతం... నిందితులకు మార్చి 1 వరకు రిమాండ్‌

  • కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను కాల్చిచంపిన మావోయిస్టు
  • కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ
  • ఆరుగురు నిందితుల అరెస్టు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన ఘటనకు సంబంధించిన కేసులో ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్‌ పొడిగించింది. గత ఏడాది సెప్టెంబరు 23న ఉదయం గ్రామ దర్శిని కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కిడారి, సివేరిలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం తొట్టంగి గ్రామం సమీపంలో మావోయిస్టు చుట్టుముట్టి కాల్చి చంపిన విషయం తెలిసిందే.

 ఈ కేసు విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆరుగురు అనుమానితులను అరెస్టు చేసి కోర్టు ముందుంచింది. నిందితులు సుబ్బారావు, ఈశ్వరి, జమిలి శోభన్‌, కొర్రాకమల, పంగి నరసయ్య, వంత ధర్మయ్యలకు కోర్టు జనవరి 31 వరకు రిమాండ్‌ విధించింది. ఈ గడువు గురువారంతో ముగియడంతో పటిష్ట బందోబస్తు మధ్య నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా మార్చి 31 వరకు రిమాండ్‌కు న్యాయమూర్తి ఆదేశించారు.

Visakhapatnam District
araku MLA murder
suspects remand extension
  • Loading...

More Telugu News