Union Budget 2019-20: ప్రసంగం ప్రారంభంలోనే అరుణ్ జైట్లీని తలచుకున్న పీయూష్ గోయల్!

  • అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటున్న అరుణ్ జైట్లీ
  • ఆయన త్వరగా కోలుకోవాలి
  • ప్రజాసేవలో తిరిగి నిమగ్నం కావాలన్న పీయూష్

కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టేందుకు, తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, తన ప్రసంగం ప్రారంభంలోనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తలచుకున్నారు. ఆయన అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. తిరిగి ఆయన ఇండియాకు చేరి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఆపై తన బడ్జెట్ ప్రసంగాన్ని పీయూష్ గోయల్ ప్రారంభించగా, విపక్షాలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Union Budget 2019-20
Piyush Goyal
Arun Jaitly
  • Loading...

More Telugu News