Pasala Baby: తొలి సినిమా చాన్స్ కొట్టేసిన పసల బేబి... ఫిదా చేస్తున్న గొంతు!

  • జీవితంలో గరళాన్ని మింగి.. అంటూ సాగే పాట
  • రికార్డ్ చేసిన సంగీత దర్శకుడు రఘు కుంచె
  • నెట్టింట వైరల్ అవుతున్న పాట

పసల బేబీ పాడిన మరో పాట ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆమెకు తొలిసారిగా సినిమాలో పాడే అవకాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు రఘు కుంచె, "జీవితంలో గరళాన్ని మింగి.. తన గొంతులోని అమృతాన్ని మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాట..." అని సాగే పాటను ఆమెతో పాడించి, యూట్యూబ్ లో ఉంచడంతో అదిప్పుడు దూసుకుపోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'పలాస 1978' చిత్రంలో ఈ పాట ఉంటుంది. దీనికి లక్ష్మీ భూపాల లిరిక్స్ అందించాడు.

కాగా, ఇటీవల దుబాయ్, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి వచ్చిన బేబీ, మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకోగా, ఆ వెంటనే రఘు కుంచె ఈ పాటను రికార్డ్ చేశారట. నెట్టింట లక్షలాది వ్యూస్ తెచ్చుకుంటూ వైరల్ అవుతున్న బేబీ పాడిన పాటను మీరూ వినవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News