Australia: స్మార్ట్ ఫోన్లో మైనర్ల శృంగార వీడియోలు.. భారతీయుడిని అరెస్ట్ చేసిన ఆస్ట్రేలియా అధికారులు!

  • ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఘటన
  • పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం
  • మలేసియా నుంచి పెర్త్ కు వెళ్లిన యువకుడు

ప్రపంచంలో ఒక్కోదేశానికి ఒక్కో రకమైన నిబంధనలు, చట్టాలు ఉంటాయి. అక్కడకు వెళ్లేముందు వాటిని తెలుసుకోకపోతే తీవ్రమైన చిక్కుల్లో పడిపోతాం. తాజాగా మలేసియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ భారతీయ యువకుడు తన మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు ఉండటంతో కటకటాల పాలయ్యాడు.

మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ కు ఓ భారతీయ యువకుడు(32) చేరుకున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా అతని స్మార్ట్ ఫోన్ ను పరిశీలించిన అధికారులు మైనర్ల శృంగార వీడియోలను గుర్తించారు. ఆస్ట్రేలియాలో మైనర్లు, చిన్నపిల్లల అశ్లీల వీడియోలు కలిగి ఉండటం తీవ్రమైన నేరం.

దీంతో సదరు భారతీయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ నేరం రుజువైతే నిందితుడికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలుశిక్ష,  రూ.3.75 కోట్ల భారీ జరిమానా విధించే అవకాశముందని భావిస్తున్నారు.

Australia
perth
malaysia
porn videos
Police
arrest
airport
  • Loading...

More Telugu News