Andhra Pradesh: చంద్రబాబు కొత్త లుక్.. నలుపు రంగు దుస్తుల్లో అసెంబ్లీకి బయలుదేరిన ఏపీ సీఎం!

- నలుపు చొక్కా, తెలుపు ఫ్యాంటుతో అసెంబ్లీకి బాబు
- ఏపీకి అన్యాయం చేయడంపై నిరసన
- ఈ నెల 11-14 మధ్య ఢిల్లీలో ధర్మపోరాటం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నలుపు రంగు చొక్కా, తెలుపు ఫ్యాంటు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా నలుపు దుస్తులు ధరించి రావాలని ఎమ్మెల్యేలను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం స్వయంగా నలుపు రంగు దుస్తులు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు.
