Isha Ambani: తాము 'ఐవీఎఫ్' కవలలమంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా

  • ముకేశ్-నీతా పెళ్లయిన ఏడేళ్లకు జన్మించిన ఇషా, ఆకాశ్
  • ఐదేళ్ల వయసు వచ్చే వరకు అన్నీ అమ్మే చూసింది 
  • 'వోగ్' ఇంటర్వ్యూలో వెల్లడించిన ఇషా అంబానీ

రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ (27) ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఆమె తండ్రి ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘వోగ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని ఓ విషయాన్ని వెల్లడించారు.

ఇషా ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఆనంద్ పిరిమల్‌ను పెళ్లాడారు. కాగా, తల్లిదండ్రులు ముకేశ్ అంబానీ-నీతా అంబానీ వివాహమైన ఏడేళ్ల తర్వాత తాను, సోదరుడు ఆకాశ్ అంబానీ జన్మించినట్టు ఇషా తెలిపారు. అది కూడా ఐవీఎఫ్ విధానంలో జన్మించినట్టు వివరించారు. తమకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు ఆలనా పాలనా అన్నీ అమ్మే చూసుకుందని, అప్పటి వరకు తన వ్యవహారాలను పక్కనపెట్టేశారని పేర్కొన్నారు. ఆమె ఇప్పటికీ, ఎప్పటికీ ‘టైగర్ మామ్’ గానే ఉన్నారని ఇషా చెప్పుకొచ్చారు.

Isha Ambani
Akash Ambani
IVF process
Mukesh Ambani
Reliance JIO Infocomm
  • Loading...

More Telugu News