Elon Musk: భూమిని కాపాడేందుకు త్యాగం... తన అన్ని పేటెంట్లనూ వదిలేసుకున్న ఎలాన్ ముస్క్!

  • పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు నిర్ణయం
  • మా సాంకేతికతను ఎవరైనా వినియోగించుకోవచ్చు
  • విప్లవాత్మక మార్పు తేవాలని కోరిన ముస్క్

భూమిపై పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తన వద్ద ఉన్న అన్ని పేటెంట్లనూ వదిలేసుకుంటున్నట్టు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ ముస్క్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తమకు మాత్రమే సొంతమైన సాంకేతికతను ఎవరైనా వినియోగించుకోవచ్చని, వారిపై ఎటువంటి దావాలూ వేయబోమని స్పష్టం చేశారు. ఓ చిన్న ఆలోచన విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని తన బ్లాగ్ పోస్టులో వెల్లడించిన ఎలాన్, తమ సంస్థ టెక్నాలజీపై నమ్మకమున్న ప్రతిఒక్కరూ దాన్ని వాడుకుని, భూమిని కాపాడే ప్రొడక్టుల తయారీకి మార్గం సుగమం చేయవచ్చని అన్నారు.

Elon Musk
Patents
Releases
Earth
  • Loading...

More Telugu News