Chigurupati Jayaram: హైవేపై కారులో కోస్టల్ బ్యాంకు చైర్మన్ జయరామ్ మృతదేహం.. పలు అనుమానాలు!

  • ఐతవరం వద్ద కారులో మృతదేహం
  • కనిపించకుండా పోయిన డ్రైవర్
  • టోల్‌గేట్ల వద్ద సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు

కోస్టల్ బ్యాంకు చైర్మన్ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.  కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని ఐతవరం వద్ద హైవేపై కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

జయరామ్ మృతికి రోడ్డు ప్రమాదమే కారణమా? లేక హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కారు వెనక సీట్లో ఆయన మృతదేహం పడి ఉండగా, డ్రైవర్ జాడ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హైవేపై టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆచూకీ లేకుండా పోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Chigurupati Jayaram
Coastal bank chairman
Krishna District
Murder
  • Loading...

More Telugu News